BIKKI NEWS (FEB. 26) : CM REVIEW MEETING ON EDUCATION DEPARTMENT ON FEBRUARY 26th. హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
CM REVIEW MEETING ON EDUCATION DEPARTMENT ON FEBRUARY 26th
ఈ సందర్భంగా భారతీయ విద్యా భవన్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాలని సూచించారు.
కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడొద్దని అధికారులకు దిశానిర్దేశం చేశారు
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు
మిడ్ డే మీల్స్ కార్యక్రమానికి విజయా డెయిరీ నుంచి పాలు సేకరించాలని సూచించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యత కోసం ఏఐ టెక్నాలజీ వినియోగించాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ట్రాన్స్‌పోర్ట్ కోసం ఎలక్ట్రికల్ బస్ ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సూచించారు.
ప్రైవేట్ స్కూల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దుతో పాటు రికవరీ చేసేలా నిబంధన విధించాలని ఆదేశించారు.

