BIKKI NEWS (FEB. 25) : General Knowledge Bits 107 for compititive exams. -పోటీ పరీక్షల కోసం డైలీ జనరల్ నాలెడ్జ్ బిట్స్
General Knowledge Bits 107 for compititive exams
1) 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా గల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎంత శాతం?
జ : 16.49
2) 2011 జనాభా లెక్కల ప్రకారం అల్ప జనాభా గల సిక్కిం జనాభా శాతం ఎంత?
జ : 0.05%
3) 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ లింగ నిష్పత్తి ఎంత?
జ : 949:1000
4) 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత గల బీహార్ రాష్ట్ర జనసాంద్రత ఎంత?
జ : 1,106
5) ఒక చదరపు కిలో మీటరు వైశాల్యంలో నివసించే సగటు జనాభాను ఏమని అంటారు.?
జ : జనసాంద్రత
6) ప్రతి 1000 మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది.?
జ : లింగనిష్పత్తి (Sex Ratio)
7) మహాత్మాగాంధీని ‘నగ్న ఫకీర్’ అని అన్నది ఎవరు?
జ : చర్చిల్
8) భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
జ : బద్రుద్దీన్ త్యాబ్జీ
9) భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడయ్యారు?
జ : 1924 బెల్గామ్ సమావేశం
10) ప్రజల మనిషి, గంగు, చిల్లరదేవుళ్లు నవలలో ప్రధాన అంశం ఏమిటి.?
జ : వెట్టిచాకిరి
11) పాకాల చెరువు నిర్మాణం చేసింది ఎవరు.?
జ : జగదల ముమ్మడి
12) వరంగల్ కోటలోని ప్రజల జీవన పరిస్థితుల వర్ణన గురించి వివరించిన గ్రంథం ఏమిటి.?
జ : క్రీడాభిరామం
13) ఇండియా లో మొదటి జాతీయ పార్క్ ఏది.?
జ : జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
14) రెడ్ డేటా బుక్ దేని గురించి వివరిస్తుంది.?
జ: అంతరించిపోయో జీవుల గురించి.
15) అత్యధిక జీవవైవిధ్యం గల దేశం ఏది.?
జ : బ్రెజిల్
16) పిచర్మొక్కలు భారతదేశం లో ఎక్కడ ఉంటాయి.?
జ : ఈశాన్య రాష్ట్రాలు
17) గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ కు కారణం అయినా ముఖ్య వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్
18) గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడు ప్రారంభమైంది.?
జ : 1850 – 1900 మద్య
19) గ్లోబల్ వార్మింగ్ గురించి మొదట ప్రస్తావించిన వ్యక్తి ఎవరు.?
జ : జేమ్స్ హన్సెన్
20) మినిమిటా వ్యాదిని మొదట ఏ దేశంలో గుర్తించారు.?
జ : జపాన్
21) సెయింట్ హెలినా చట్టం అని దేనికి పేరు.?
జ : చార్టర్ యాక్ట్ – 1833
22) జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కు కారణమైన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : జనరల్ ఓ డయ్యర్
23) 15వ గ్రూప్ మూలకాలను ఏమని పిలుస్తారు.?
జ : నిక్టోజెన్స్
24) ముస్లిం లీగ్ ఎప్పుడు ఏర్పడింది.?
జ : 1906
25) పాకిస్థాన్ అనే పేరును ఎవరు ప్రతిపాదించారు.?
జ : చౌదరి రహ్మత్ ఆలీ
26) ఏ దౌత్యం విఫలమవడంతో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు.?
జ : క్రిప్స్ దౌత్యం
27) సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఎక్కడ ఏర్పాటు చేశాడు.?
జ : సింగపూర్
28) సుభాష్ చంద్రబోస్ చలో డిల్లీ నినాదం ఏ సంవత్సరంలో ఇచ్చాడు.?
జ : 1944
29) తెలంగాణ ఏర్పాటు కు అనుకూలంగా రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక సమర్ధనాలతో నివేదికను అందించినది ఎవరు?
జ : హెచ్.సి. హెడ
30) తెలంగాణలోని ఏ నృత్యం పంటకోత, విత్తనాలు నాటడం వంటి రోజువారి ఇతివృత్తాలతో కూడి ఉంటుంది.?
జ : లంబాడి నృత్యం

