BIKKI NEWS (SEP. 22) : 3000 JOBS IN TELANGANA ELECTRICITY DEPARTMENT. తెలంగాణ విద్యుత్ సంస్థలన్నింటిలో కలిపి 3 వేల వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అయితే వీటిని ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
3000 JOBS IN TELANGANA ELECTRICITY DEPARTMENT
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సంబంధం లేకుండా ఈ సంస్థలు సొంతంగా నోటిఫికేషన్లు జారీచేసి ఉద్యోగాలను భర్తీ చేసుకునే విధానం కొనసాగుతోంది. దీంతో వేర్వేరు నియామక పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులు అన్ని పరీక్షలు రాస్తున్నారు. కొందరికి రెండు, మూడు సంస్థల్లో ఉద్యోగాలు వస్తుండగా ఏదో ఒక్కదానిలో చేరుతున్నారు. దీంతో మిగతావి ఖాళీగా మిగులుతున్నాయి.
ఇకపై ఒకటే నోటిఫికేషన్ జారీచేసి 4 సంస్థల పరీక్షలను ఒకే సమయంలో నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఖాళీల వివరాలు
ప్రస్తుతం 4 విద్యుత్ సంస్థల్లో 934 ఖాళీలున్నాయి. ఉత్తర తెలంగాణ డిస్కంలో 394, జెన్కోలో 283, దక్షిణ తెలంగాణ డిస్కంలో 135, ట్రాన్స్కోలో 122 పోస్టులు ఉన్నాయి యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రం, రామగుండంలో థర్మల్, ఇతర ప్రాంతాల్లో సౌర విద్యుత్ కేంద్రాలు నిర్మాణంతో దాదాపు 2 వేల కొత్త పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.