BIKKI NEWS (JULY 30) : 2003 DSC TEACHERS ARE ELIGIBLE FOR OLD PENSION. 2003 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడిన టీచర్ లు పాత పెన్షన్ కు అర్హులేనేంటూ తెలంగాణ హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
2003 DSC TEACHERS ARE ELIGIBLE FOR OLD PENSION
2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన తమకు పాత పెన్షన్ ను వర్తింపజేయకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
2003 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన పిటిషనర్లకు 2004 ఆగస్టు 31వరకు అమల్లో ఉన్న పాత పెన్షన్ పథకాన్ని వర్తింప జేయడం లేదన్నారు. 2004 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని వర్తింపజేయడం సరికాదన్నారు. 2003 కంటే ముందు ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి 2003లో జారీచేసిన నోటిఫికేషన్ కింద ఎంపిక ప్రక్రియ మొత్తం 2004 జూన్ కల్లా పూర్తయిందన్నారు. పాలనాప రమైన జాప్యం కారణంగా 2005 నవంబరులో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయాని టీచర్ ల తరపున న్యాయవాదులు వివరించారు.
వీటిపై మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్, న్యాయవాది బొబ్బిలి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ
వాదనలను విన్న జస్టిస్ నగేశ్ భీమపాక పరిపాలనాపరమైన కారణం వల్ల 2004 జూన్ లో ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు ఆలస్యంగా జరిగాయని, అందువల్ల వీరు పాత పెన్షన్ పథకానికి అర్హులేనని తెలిపారు. వారికి పాత పెన్షన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.