BIKKI NEWS (SEP. 19) : 2.5 lakhs scholarship for ST students. జాతీయ గిరిజన విద్యార్థుల ఉన్నత విద్యా పథకం కింద కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గిరిజన విద్యార్థులకు డిగ్రీ, పీజీ చదువులకు స్కాలర్షిప్లను అందజేయాడానికి ప్రకటన విడుదల చేసింది.
2.5 lakhs scholarship for ST students.
సంవత్సరానికి 2.50 లక్షల విలువైన స్కాలర్షిప్ ను ఈ పథకం కింద గిరిజన విద్యార్థులకు అందజేయనున్నారు.
అర్హతలు :
- విద్యార్థి గిరిజనుడై ఉండాలి.
- మంత్రిత్వ శాఖ ప్రకటించిన విద్యాసంస్థల్లో డిగ్రీ లేదా పీజీలో అడ్మిషన్ పొందివుండాలి.
- కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఆరు లక్షల లోపు ఉండాలి.
అనవసరమైన పత్రాలు :
- కులం సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- అడ్మిషన్ ఫీజు రసీదు
- ఆధార్ లింక్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
- విద్యార్హతల మార్క్స్ మెమో
- బోనఫైడ్ సర్టిఫికెట్
దరఖాస్తు విధానము మరియు గడువు : విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 31 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://scholarships.gov.in/Students

