BIKKI NEWS (OCT. 03) : Windows 10 support. విండోస్ 10 వాడుతున్న వారికి 2025 అక్టోబర్ 14 నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ విడుదల చేయబోమని ప్రకటన విడుదల చేసింది..
Windows 10 support
విండోస్ 10కు మైక్రోసాఫ్ట్ సపోర్ట్ నిలిపివేసినా ఎప్పటిలానే ఓఎస్ పనిచేస్తుంది. అయితే, సెక్యూరిటీ అప్‌డేట్స్ మాత్రం రావని స్పష్టంచేశారు. దీనివల్ల భద్రతాపరమైన రిస్కులు, మాల్‌వేర్, కంపాటబిలిటీ వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్ చేసే వారికి రిస్క్ పొంచి ఉంటుంది.
అయితే, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ మాత్రం 2028 అక్టోబర్ వరకు కొనసాగుతాయని మైక్రోసాఫ్ట్ స్పష్టంచేసింది. ఇది ప్రాథమిక స్థాయిలో భద్రతను మాత్రమే అందించగలదు.
వినియోగదారులు విండోస్ 11కు అప్‌గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత విండోస్ 10లోనే కొనసాగాల్సి వస్తే.. డబ్బులు పెట్టి ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ (ESU) ప్రోగ్రామ్ కింద సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
మీ పీసీ హార్డ్‌వేర్ సపోర్ట్ చేస్తే నిర్ణీత గడువులోగా విండోస్ 11కు అప్‌గ్రేడ్ అవ్వండి

