WHO – ప్రతి ఏడుగురిలో ఒకరు మెంటలే

BIKKI NEWS (SEP. 03) : WHO Report on mental health. ప్రపంచంలో ప్రతి ఏడుగురిలో ఒకరికి మానసిక రుగ్మతలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో సంచలన విషయం బయటపెట్టింది.

WHO Report on mental health

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది పైగా జనాభా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని ఈ నివేదిక తెలిపింది.

వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే, మెంటల్ హెల్త్ అట్లాస్ 2024 నివేదిక ప్రకారం ప్రతి వంద మరణాల్లో ఒకటి ఆత్మహత్యగా ఉంటుందని, దీనికి ప్రధాన కారణం మానసిక రుగ్మత లేనని స్పష్టం చేసింది. యువతలో ఎక్కువగా ఆత్మహత్యలకు కారణం మానసిక రుగ్మతులేనని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి 200 మందిలో ఒకరికి స్కిజోప్రేనియా, 150 మందిలో ఒకరికి బైపోలార్ డిజార్డర్ సమస్యలతో బాధపడుతున్నారని నివేదిక వెల్లడించింది.

మానసిక రుగ్మతల వలన ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తున్నాయని నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది