BIKKI NEWS (NOV. 23) : WEIGHTAGE FOR TEACHERS IN TET. టెట్ రాస్తున్న ఇన్ సర్వీస్ టీచర్లకు 20 శాతం వెయిటేజ్ ఇవ్వాలని పలువురు ఉపాధ్యాయులు కోరుతున్నారు.
WEIGHTAGE FOR TEACHERS IN TET.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా 2026 జనవరి సంబంధించి టెట్ నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు తమకు టెట్ పరీక్షలో 20% వెయిటేజ్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
టెట్ మార్కులకు టీచర్ పోస్టులలో 20% వెయిటేజ్ ఉంటుంది కావున… తాము ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వలన ఆ 20% మార్కులను వెయిటేజ్ రూపంలో ఇవ్వాలని కోరుతున్నారు . తద్వారా గరిష్టంగా ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించేందుకు వీలవుతుందని కోరుతున్నారు.
దీనిపై ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ వర్గాలు ఆలోచించి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
