BIKKI NEWS (AUG. 20) : Vice president election 2025. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్ డి ఏ మరియు ఇండియా కూటములు తమ అభ్యర్థులను ప్రకటించాయి.
Vice president election 2025.
ఎన్డీఏ కూటమి తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించగా, ఇండియా కూటమి మాజీ జస్టిస్ సుదర్శన రెడ్డిని తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి.
ఎవరి బలమెంత.?
- లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీ ల మొత్తం సంఖ్య : 782.
- గెలుపుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ : 394
- ఎన్డీఏ కూటమి బలం : 422
- ఇండియా కూటమి బలం : 330
- తటస్థులు : 30
ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీపడే అభ్యర్థులకు ఓటు వేయడానికి అర్హత కలిగిన వాళ్లు లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీలు మాత్రమే.
ఉప రాష్ట్రపతి భారత ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానం. భారత రాజ్యాంగం లోని 63వ అధికరణంలో ఉప రాష్ట్రపతి పదవి గురించిన ప్రస్తావన ఉంది.
ఆర్టికల్ 63 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. అతను ఐదేళ్ల పదవీకాలం పాటు సేవలందిస్తాడు.
భారతదేశ పౌరుడై, 35 సంవత్సరాల వయస్సు కలిగిన వారు మాత్రమే ఉపరాష్ట్రపతి పదవికి అర్హులు.
Vice president election procedure
పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా వైస్-ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. అలాంటి ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ఉపరాష్ట్రపతి పదవికి ఒక వ్యక్తిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభల సభ్యులందరూ ఉంటారు.
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలను భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది.
భారత ఉపరాష్ట్రపతుల జాబితా
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) జాకీర్ హుస్సేన్
3) వివి గిరి
4) గోపాల్ స్వరూప్ పాఠక్
5) బీడీ జెట్టి
6) మహ్మద్ హిదయతుల్లా
7) రామస్వామి వెంకట్రామన్
8) శంకర్ దయాళ్ శర్మ
9) కేఆర్ నారాయణన్
10) కృష్ణకాంత్
11) బైరాన్ సింగ్ షెకావత్
12) మహ్మద్ హమీద్ అన్సారీ
13) ముప్పవరపు వెంకయ్య నాయుడు
14) జగదీప్ ధన్‌ఖడ్
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

