BIKKI NEWS (SEP. 24) : Very heavy rains on September 26th and 27th. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తీవ్ర వాయుగుండం కారణంగా సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Very heavy rains on September 26th and 27th.
సెప్టెంబర్ 25న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం 26 నాటికి వాయుగుండంగా బలపడి 27న దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.