RAIN ALERT – అత్యంత భారీ వర్షాలు – సెలవు ప్రకటించే అవకాశం

BIKKI NEWS (AUG.28) : Very heavy rains alert in Telangana districts. తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉదయం 8.30 గంటల వరకు. వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హైదరాబాద్ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Very heavy rains alert in Telangana districts.

అలాగే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

మరోవైపు భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.

ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలలో సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. వర్షాలను
బట్టి మరికొన్ని జిల్లాల్లో రేపు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.