12 లక్షల మంది టీచర్లకు ఊరట.!

union govt may take decision on in service teachers TET Eligibility

BIKKI NEWS (JAN. 11) : union govt may take decision on in service teachers TET Eligibility. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది టీచర్లు టెట్ పరీక్ష రాయవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

union govt may take decision on in service teachers TET Eligibility

2027 సెప్టెంబర్ వరకు టెట్ అర్హత లేని టీచర్లు తమ ఉద్యోగాలు కోల్పోతారని సుప్రీంకోర్టు తన తీర్పు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపద్యంలో టీచర్లు పలు రకాలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞాపనలు అందజేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన టెట్ పరీక్షలలో ఇన్ సర్వీస్ టీచర్లు 50% వరకు మాత్రమే అర్హత సాధించి ఉండడంతో, అర్హత సాధించని టీచర్లకు ఉద్యోగాలు కోల్పోయో పరిస్థితి ఏర్పడడంతో టీచర్ల లో మానసిక సంఘర్షణ నెలకొని ఉంది .

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు టెట్ అర్హత లేని టీచర్ల డేటాను పంపవలసిందిగా కోరింది. ఈ నేపథ్యంలో టెట్ అర్హతపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చే సాధ్యసాధ్యాలను, న్యాయపరమైన చిక్కులను కేంద్ర విద్యా శాఖ పరిశీలిస్తున్నట్లు… అందుకు తగ్గ చర్యలు తీసుకోవడానికి టెట్ అర్హత లేని టీచర్ల డేటాను సేకరిస్తున్నట్లు సమాచారం.

దీనిపై నెల రోజుల్లోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని విద్య నిపుణులు చెబుతున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK