UGC NEWS – వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ ఆపేయాలంటూ ఆదేశాలు

BIKKI NEWS (AUG. 16) : UGC ORDERS FOR STOP SEVERAL COURSES. యూజీసీ ఆరోగ్య సంరక్షణ, నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 కిందికి వచ్చే కోర్సులను డిస్టెన్స్, ఓపెన్ విద్యా విధానంలో బోధించడం నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

UGC ORDERS FOR STOP SEVERAL COURSES

సైకాలజీ, మైక్రోబయాలజీ, ఆహార, పోషణ విభాగం, జీవశాస్త్రం, క్లినికల్ న్యూట్రిషన్, సహా ఆరోగ్య సంరక్షణ కోర్సులన్నింటిపై నిషేధం విధించినట్లు యూజీసీ తెలిపింది.

దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఈ పద్దతుల ద్వారా కోర్సుల్లో అడ్మిషన్లు ఇవ్వరాదని ఆదేశించింది.

జులై – ఆగస్టు 2025 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.

24వ దూర విద్యా సంస్థల సిఫార్సుల మేరకు జులై 23న జరిగిన యూజీసీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.