Today top news in Telugu March 5th – నేటి ప్రధాన వార్తలు

Today top news in telugu march 5th - bikki news

BIKKI NEWS (MAR. 05) : Today top news in Telugu March 5th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu March 5th

Today Telangana News

నెల రోజుల్లో తెలంగాణ నూతన విద్యా విధానం అమలు చేయనున్నట్లు కే. కేశవరావు తెలిపారు.

తెలంగాణ నుండి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ తరఫున వేం నరేందర్ రెడ్డి మరియు అభిషేక్ మను సింఘ్వీ ఎంపిక.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో బేటి అయిన సీఎం రేవంత్ రెడ్డి మరింతమంది ఐపీఎస్ లను తమకు కేటాయించాలని వినతి.

25 వేల మంది బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై ఫొరెన్సిక్ ఆడిట్

మార్చి 8 నుండి మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి దామోదర తెలిపారు

Today AP News

అత్యంత నిష్టతో ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని వైయస్ జగన్ పేర్కొన్నారు.

ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఇప్పటికే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించామని సీఎం బాబు తెలిపారు.

మార్చి 18 నుండి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

నేడు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు హాల్ టికెట్లను విడుదల చేయనున్నారు.

Today National News

రాజ్యసభకు బీహార్ సీఎం నితీష్ కుమార్. త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం.

వాట్సాప్ చాట్ ఆధారంగా విడాకులు మంజూరు చేయలేం -సుప్రీంకోర్ట్

నాలుగు రోజుల పర్యటన కొరకు ఢిల్లీకి చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్

భారత విద్యార్థులకు కెనడా ప్రభుత్వం 10 కోట్ల డాలర్ల స్కాలర్షిప్లను మంజూరు చేసింది.

భవిష్య నిధి కనీస నిర్మాణం 25%. కొత్తగా ఈపీఎఫ్ ఈపీఎఫ్ 2026 పథకాలు అమలు

Today International News

ఖమేనీ రెండో కొడుకు మోజ్తాబా ఇరాన్ సుప్రీం లీడర్ గా ఎంపికైనట్లు వస్తున్న వార్తలు ఖండించిన ఇరాన్.

శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ నౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడి. 101 మంది గల్లంతయ్యారు..

నేడు నేపాల్ ఎన్నికలు. 270 మంది సభ్యులు ఉన్న ప్రతినిధి సభకు ఎన్నికలు.

Today Business News

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు. పది లక్షల కోట్లు ఆవిరి. నేటి స్టాక్ మార్కెట్ అంచనాలుపై నిపుణుల విశ్లేషణ కోసం క్లిక్ చేయండి.

బుధవారం భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. నేటి ధరలు వివరాలు.

Today Sports News

NZ VS SA – ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికా పై ఘనవిజయం సాధించి, ఫైనల్ కు చేరింది.

IND VS ENG – నేడు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ 33 బంతుల్లోనే సాధించిన ఆటగాడిగా ఫిన్ అలెన్ రికార్డు సృష్టించాడు.

లారియస్ వరల్డ్ టీం ఆఫ్ ది ఇయర్ 2026 విభాగంలో ఎంపికైన భారత మహిళల జట్టు.

Today Educational and Job Updates

తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల 2026 హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. విద్యార్థులు 8096958096 , నెంబర్ కు వాట్సాప్ లో Hi అని మెసేజ్ పంపితే విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు పొందవచ్చు

నేడు తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో భాగంగా ప్రథమ సంవత్సరం మ్యాథ్స్ 1B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

బుధవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో 13 మంది పై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు.

AP POLYTECHNIC NOTIFICATION 2026 విడుదల.

CUET PG 2026 ADMIT CARDS విడుదల.

IISER IAT 2026 NOTIFICATION విడుదల

AP KGBV ADMISSIONS 2026 , మార్చి 12 నుండి ఏపీ కేజీబీవీ లలో అడ్మిషన్ల స్వీకరణ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →