Today top news in telugu by bikki news

Today top news in Telugu April 2nd 2026 – నేటి ప్రధాన వార్తలు

హైదరాబాద్ (ఏప్రిల్ 02) : Today top news in Telugu April 2nd 2026 – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu April 2nd 2026

Today Telangana News

భూ భారతి పోర్టల్ ప్రారంభం: భూ రికార్డుల పారదర్శకత కోసం రూపొందించిన ‘భూ భారతి’ పోర్టల్‌ను నేడు (ఏప్రిల్ 2) ఐదు మండలాల్లో (కుసుమంచి, అశ్వారావుపేట, ఆమంగల్, వత్పల్లి, కోస్గి) పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రారంభించింది.

ఐటీ పారిశ్రామిక విధానం: తెలంగాణను గ్లోబల్ ఐటీ హబ్‌గా మార్చేందుకు త్వరలో కొత్త ఐటీ పాలసీని విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఖాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

చేయూత పింఛను లను నూతన లబ్దిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం.

మీ సేవా వినియోగం చార్జీలు 50% పెంపు

Today Andhra Pradesh News

అమరావతి ఏకైక రాజధాని బిల్లు: అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు, 2026’ నిన్న వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం పొందింది.

MAVIGUN పేరుతో నూతన రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని జగన్ పేర్కొన్నారు.

క్యూఆర్ కోడ్ బియ్యం బస్తాలు: పారదర్శకత కోసం మరియు రైతులను గౌరవించేందుకు క్యూఆర్ కోడ్ కలిగిన బియ్యం బస్తాలను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

నక్సల్ రహిత ఏపీ: ఆంధ్రప్రదేశ్‌ను నక్సల్ రహిత రాష్ట్రంగా డీజీపీ ప్రకటించారు. తాజాగా 9 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Today National News

పీఎం మోదీ సీసీఎస్ (CCS) భేటీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ఎరువులు మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూసేందుకు ప్రధాని మోదీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించారు.

జీఎస్‌టీ వసూళ్ల రికార్డు: మార్చి నెలలో జీఎస్‌టీ వసూళ్లు 8.8% వృద్ధి చెంది ₹2 లక్షల కోట్ల మార్కును దాటాయి.

ఎల్‌పీజీ ధరల పెంపు: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర మెట్రో నగరాల్లో ₹195 వరకు పెరిగింది

ప్రతిపక్షం (Congress): అమరావతి రాజధాని బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది, అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

Today International News

రష్యన్ విమాన ప్రమాదం: క్రిమియా ద్వీపకల్పంలో 30 మందితో వెళ్తున్న రష్యా సైనిక విమానం కూలిపోయింది. దర్యాప్తు కొనసాగుతోంది.

ఇరాన్ హెచ్చరిక: తమపై ఆంక్షలు విధిస్తున్న విదేశీ కంపెనీలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

స్పెయిన్ మరియు ఇటలీ షాక్: ఇరాన్ యుద్ధానికి వెళ్తున్న అమెరికా జెట్ విమానాలకు తమ గగనతలాన్ని ఈ దేశాలు మూసివేసాయి.

యుద్ధ విమానాల మోహరింపు: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా అదనపు యుద్ధ విమానాలను గల్ఫ్ ప్రాంతానికి పంపింది.

యూఎస్ ట్రేడ్ రిపోర్ట్: భారత దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని అమెరికా తన తాజా వాణిజ్య నివేదికలో పేర్కొంది.

చమురు ధరల పెరుగుదల: గల్ఫ్ సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి.

వారెన్ బఫ్ఫెట్ నిర్ణయం: గేట్స్ ఫౌండేషన్‌కు ఇకపై విరాళాలు ఇవ్వకూడదని వారెన్ బఫ్ఫెట్ నిర్ణయించుకున్నారు.

Today Business News

Stock market : బుధవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్. నేటి స్టాక్ మార్కెట్ అంచనాల కోసం క్లిక్ చేయండి.

Gold Rate : బుధవారం భారీగా పెరిగిన బంగారం ధర. నేటి బంగారం వెండి ప్లాటినం ధరలు డాలర్ తో రూపాయి మారకం విలువ కోసం క్లిక్ చేయండి

జెట్ ఫ్యూయల్ ధరల పెంపు: విమాన ఇంధన ధరలు 8.5% పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది

వడ్డీ రేట్లు: ఆర్బీఐ వచ్చే వారంలో వడ్డీ రేట్లపై సమీక్ష జరపనుంది.

Today Sports News

LSG VS DC – లక్నో పై డిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ 2026 రికార్డు: ఐపీఎల్ 2026 ప్రారంభ వారాంతంలోనే 51.5 కోట్ల వ్యూయర్ షిప్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది.

IPL 2026 – నేడు ఐపీఎల్ లో SRH – KKR జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Today Education and Job Updates

జేఈఈ మెయిన్ సెషన్-2: ఏప్రిల్ 2, 4 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు వెలువడ్డాయి. QR కోడ్ ఉన్న కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇంటర్మీడియట్ కోచింగ్: ఐఐటీ మరియు నీట్ (NEET) లక్ష్యంగా పెట్టుకున్న ఇంటర్ విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కోచింగ్ ప్రారంభించింది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →