Today top news in telugu april 18th - నేటి ప్రధాన వార్తలు - bikki news

Today top news in Telugu April 18th – నేటి ప్రధాన వార్తలు

BIKKI NEWS (APRIL 18) : Today top news in Telugu April 18th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu April 18th

Today Telangana News

రెండో పి ఆర్ సి తో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేశాయి.

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షతను తొలగించెందుకు రోహిత్ వేముల చట్టాన్ని అమలు పరిచేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో వీగిపోవడంతో జాతీయ విపత్తును నివారించినట్లు అయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు

మే నెలలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ మేరకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.

తెలంగాణ నుండి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్రానికి సీఎం వినతి.

తెలంగాణ రాష్ట్రంలో 11 జిల్లాలకు నూతన డిఐఓలను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది

Today A.P. News

మహిళలకు మహా ద్రోహం జరిగిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని రెండో విడత భూసేకరణలు ఎకరానికి 40000 రూపాయల చొప్పున కవులు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర పునేరా నియామకం.

నిమిషం ఆలస్యమైనా ప్రవేశ పరీక్షలకు అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలిపిన వైకాపా

Today National News

లోక్ సభలో వీగిపోయిన 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ తో ముడిపడి ఉంది ఈ బిల్లు.

ఇది మహిళా రిజర్వేషన్ల బిల్లు కానే కాదని అందుకే వ్యతిరేకంగా ఓటు వేశామని రాహుల్ గాంధీ మరియు విపక్షాలు తెలిపాయి.

ఆర్థిక పరిస్థితిని కుల వివక్షతో పోల్చలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ లతో ఈ డబ్ల్యూ ఎస్ వర్గాన్ని పోల్చలేమని స్పష్టం చేసింది.

ప్రత్యేక మతాచారాలు న్యాయ సమీక్షకు అర్హమైనవే అంటూ సుప్రీంకోర్టు శబరిమల కేసు నేపథ్యంలో వ్యాఖ్యానించింది.

రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు.

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

Today International News

ఆర్మోజ్ జల సంధిని తెరిచిన ఇరాన్. వాణిజ్య నౌకలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జలసంది గుండా ప్రయాణిస్తున్నాయి

తాను పది యుద్ధాలను ఆపానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించుకున్నారు

Today Business News

బ్లూమ్ బర్గ్ 2026 ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మాస్క్ మరోసారి నిలిచాడు. భారత్, ఆసియా సంపన్నుడిగా ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి గౌతం ఆదాని నిలిచాడు.

రెండు లక్షల కోట్ల డాలర్ల ఐపీఓ కి ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సిద్ధమవుతోంది.

2025 – 26 లో 6.56 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది.

శుక్రవారం సెన్సెక్స్ 505, నిఫ్టీ 157 పాయింట్ల లాభంతో ముగిశాయి.

శుక్రవారం బంగారం ధర దాదాపు 1400/- రూపాయలు తగ్గింది.

Today Sports News

IPL 2026 : గిల్ సూపర్ ఇన్నింగ్స్ తో కేకేఆర్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఇది గుజరాత్ జట్టుకు వరుసగా మూడో విషయం.

నేడు ఐపీఎల్ లో బెంగళూరు – ఢిల్లీ జట్ల మధ్య మరియు హైదరాబాద్ – చెన్నై జడ్ల మధ్య రెండు మ్యాచ్లు జరగనున్నాయి.

ఆసియా జూడో ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి ఇనున్‌గంబి కాంక్ష పతకాన్ని గెలుచుకుంది.

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20 లో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది.

Today Education and Job Updates

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లో 668 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

CA INTET FINAL హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశాలు కల్పించే జిప్ మాట్ 2026 నోటిఫికేషన్ విడుదల

NCHM JEE 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లు విడుదల

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →