TGSRTC JOBS – పదో తరగతితో డ్రైవర్, శ్రామిక్ ఉద్యోగ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 17) : TGSRTC DRIVER and SHRAMIK JOB NOTIFICATION 2025. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ మరియు శ్రామిక పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జారీ చేసింది.

TGSRTC DRIVER and SHRAMIK JOB NOTIFICATION 2025

ఈ నోటిఫికేషన్ ద్వారా 1,000 డ్రైవర్ పోస్టులను 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయనుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు

కింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ ను క్షుణ్ణంగా చదివి తగిన పోస్టును ఎంచుకొని దరఖాస్తు చేయవలసి ఉంటుంది

దరఖాస్తు విధానం & గడువు : అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 8 నుండి 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

దరఖాస్తు ఫీజు : డ్రైవర్ పోస్టులకు 600/- (ఎస్సీ ఎస్టీ లకు 300/-) శ్రామిక్ పోస్టుకు 500/- (ఎస్సీ ఎస్టీ లకు 200/-)

డ్రైవర్ పోస్టులకు అర్హతలు :

  • పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పురుష, మహిళా అభ్యర్థులు కూడా అర్హులే.
  • HPMV, HGV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా పరీక్షలకు అర్హత కలిగి ఉండాలి

శ్రామిక్ పోస్టులకు అర్హతలు :

  • సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • పురుష, మహిళా అభ్యర్థులు కూడా అర్హులే.
  • మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా పరీక్షలకు అర్హత కలిగి ఉండాలి

వయోపరిమితి : డ్రైవర్ పోస్టులకు 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.

శ్రామిక్ పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు.

ఎంపిక విధానం :

డ్రైవర్ పోస్టులకు :

  • ఫిజీకల్ స్టాండర్డ్ టెస్ట్
  • డ్రైవింగ్ టెస్ట్
  • పదో తరగతి మార్కులు

శ్రామిక్ పోస్టులకు :

  • ఐటీఐ మార్కులు
  • అప్రెంటిస్ మార్కుల ఆధారంగా
పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
వెబ్సైట్ : https://www.tgprb.in/