BIKKI NEWS (AUG. 16) : TGSRTC CONDUCTOR JOBS NOTIFICATION. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ లో 1500 కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది.
TGSRTC CONDUCTOR JOBS NOTIFICATION
ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఈ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు
ఆర్టీసీలో డ్రైవర్లు సహా మొత్తం 11 విభాగాలతో కలిపి 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలో వెలువడనున్నాయి.
కండక్టర్ల పోస్టుల భర్తీకి కూడా అనుమతి లభిస్తే ఆర్టీసీలో 4,500 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఈ సంవత్సరంలోనే వెలువడే అవకాశం ఉంది.
2013 నుంచి ఆర్టీసీలో కండక్టర్ పోస్టుల నియామకం జరగలేదు. 2014-15లో ఉద్యోగుల సంఖ్య 56,740 ఉంటే 2025 జూన్ నాటికి ఆ సంఖ్య 39,652కి పరిమితమైంది.

