RTC JOBS – త్వరలోనే ఆర్టీసీలో 3038 జాబ్స్ నోటిఫికేషన్

BIKKI NEWS (AUG. 08) : TGSRTC 3038 JOBS NOTIFICATION SOON. తెలంగాణ ఆర్టీసీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగార్థులను కొందరు మోసం చేస్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన విడుదల చేశారు.

TGSRTC 3038 JOBS NOTIFICATION SOON.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు ప్రారంభమైందని. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని. నియామక ప్రక్రియ పూర్తిగా మెరిట్ ఆధారంగా పారదర్శకంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.

అడ్డదారుల్లో ఎవరికి కూడా ఉద్యోగాలు రావని. ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఉద్యోగార్థులకు యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు.

ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సంస్థ సూచిస్తోంది.