BIKKI NEWS (SEP. 21) : TGPSC GROUP 2 CERTIFICATE VERIFICATION SCHEDULE -IV. తెలంగాణ గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాలుగో విడత షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
TGPSC GROUP 2 CERTIFICATE VERIFICATION SCHEDULE -IV.
సెప్టెంబరు 23. నుంచి 25వరకు ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది.
మొదటి విడతలో 775, రెండో విడతలో 294, మూడో విడతలో 119 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేశారు. నాలుగో విడతలో 193 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు.
వెబ్సైట్ : https://www.tgpsc.gov.in