BIKKI NEWS : TGPSC Assistant Scientist Certificate Verification 2026. తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యమైన అప్‌డేట్. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ హాల్ టికెట్ నంబర్ల జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. నవంబర్ 12న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
TGPSC Assistant Scientist Certificate Verification 2026
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నంబర్ 01/OG/PC/2026, తేదీ 20-04-2026 ద్వారా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నియామక ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు 2026 నవంబర్ 12వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్‌లోని TGPSC కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
నవంబర్ 13 రిజర్వ్ డే
నవంబర్ 12న జరిగే సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి రిజర్వ్ డేగా నవంబర్ 13వ తేదీని కేటాయించారు. ఆ రోజు కూడా ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు.
అభ్యర్థులు తమ వెరిఫికేషన్‌కు సంబంధించిన మెటీరియల్‌ను నవంబర్ 9వ తేదీ నుంచి కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలని TGPSC సూచించింది.
అభ్యర్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాలు
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ కింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
- నోటిఫికేషన్‌లోని Annexure-VI ప్రకారం అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి.
- ప్రతి సర్టిఫికెట్‌కు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి.
- జిరాక్స్ కాపీలపై అభ్యర్థులు స్వయంగా సంతకం (Self Attestation) చేయాలి.
- నవంబర్ 12న హాజరుకాలేని అభ్యర్థులకు, పెండింగ్ డాక్యుమెంట్లు సమర్పించేందుకు నవంబర్ 13న అవకాశం కల్పించారు.
ముఖ్య గమనిక: సర్టిఫికెట్ వెరిఫికేషన్ రోజు లేదా రిజర్వ్ డే రోజున ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే తదుపరి అవకాశం ఇవ్వబోమని కమిషన్ స్పష్టం చేసింది.
అర్హత లేని అభ్యర్థులపై చర్యలు
సర్టిఫికెట్ల పరిశీలనలో అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న వివరాలు, చెక్‌లిస్ట్ లేదా సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా అర్హత లేదని తేలితే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనైనా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని TGPSC వెల్లడించింది.
అలాగే, దివ్యాంగుల (PwD) కేటగిరీ అభ్యర్థులను వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అప్పీలేట్ మెడికల్ బోర్డుకు పంపించనున్నారు. ఆ బోర్డు ఇచ్చే నివేదికే తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది.
గైర్హాజరైతే అభ్యర్థిత్వం రద్దు
నవంబర్ 12 లేదా రిజర్వ్ డే అయిన నవంబర్ 13న కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని తదుపరి నియామక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ స్పష్టం చేసింది.
రిజర్వ్ డే రోజున సాయంత్రం 5 గంటల తర్వాత పెండింగ్ డాక్యుమెంట్లను స్వీకరించబోమని కూడా తెలిపింది. వెరిఫికేషన్ అనంతరం ఖాళీలు ఏర్పడితే అవసరాన్ని బట్టి అదనపు అభ్యర్థులను కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచే అవకాశం ఉంది.
హాల్ టికెట్ నంబర్ల జాబితా విడుదల

సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను TGPSC విడుదల చేసిన అధికారిక ప్రొవిజనల్ జాబితాలో పొందుపరిచింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను పరిశీలించుకోవాలి.
అధికారిక వెబ్‌సైట్: TGPSC Official Website
- నోటిఫికేషన్: 01/OG/PC/2026
- ప్రకటన తేదీ: 07 నవంబర్ 2026
- వెరిఫికేషన్ తేదీ: 12 నవంబర్ 2026
- రిజర్వ్ డే: 13 నవంబర్ 2026

