TELANGANA MODEL SCHOOL EXAM 2026 – మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

TELANGANA MODEL SCHOOL EXAM 2026
  • BIKKI NEWS : 16-01-2026

Telangana Model school exam 2026 notification. తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లలో ఆరవ తరగతి మరియు 7 నుంచి 10 తరగతి వరకు ఖాళీగా ఉన్న అడ్మిషన్లు భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేశారు.

Telangana Model school exam 2026 notification

2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే విద్యార్థులకు మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పిస్తారు. జనవరి 17వ తేదీన పూర్తి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.

అర్హత గల విద్యార్థులు జనవరి 28 నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

ఏప్రిల్ 9వ తేదీ నుండి విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

Telangana model school entrance tests 2026

19 ఏప్రిల్ నా మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు

పరీక్షా కేంద్రాలుగా సంబంధిత మండలంలోని మోడల్ స్కూల్ లను ఎంపిక చేస్తారు.

6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10.00 నుండి 12.00 గంటల వరకు, ఏడు నుండి పదవ తరగతి విద్యార్థుల కొరకు ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : 200/- రూపాయాలు. (EWS, PwD, SC, ST, BC – 115/- రూపాయలు)

పూర్తి వివరాలు, నోటిఫికేషన్, ఆన్లైన్ దరఖాస్తు కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.

వెబ్సైట్ : tgms.telanagana.gov.in