JOB CALENDAR – నూతన జాబ్ కేలండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ

BIKKI NEWS (OCT. 04) : Telangana job notificatios as for new job calendar. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ కోసం నూతన జాబ్ కేలండర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను గుర్తించింది. వీటిలో 30 వేల పోస్టులకు ఆర్థిక అనుమతులున్నాయి.

Telangana job notificatios as for new job calendar

ఉద్యోగ ప్రకటనలకు కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తికావడం, పెండింగ్ నియామకాలన్నీ ముగియడంతో సంబంధిత విభాగాలు వర్గీకరణ, రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తూ నూతన జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ మేరకు టీజీపీఎస్సీ గురుకుల, పోలీసు నియామక బోర్డులు కొత్త ఉద్యోగాల భర్తీకి వీలుగా సంబంధిత విభాగాల నుంచి ప్రతిపాదనలు తీసుకుంటున్నాయి.

ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలు గుర్తింపు, ఉద్యోగుల సర్దుబాటు, ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతులు పొందిన పోస్టులపై ప్రభుత్వం నియమించిన కమిటీ వీటిని పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.

ఖాళీల వివరాలు ఇవే

ఇటీవల నియామకాలు పూర్తయిన వాటిలో బ్యాక్‌లాగ్ ఖాళీలు దాదాపు 4 వేలకు పైగా ఉండే అవకాశాలున్నాయి.

పోలీస్ విభాగంలో 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలో దాదాపు 10 వేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా.

ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలున్నట్లు సమాచారం.

ఉపాధ్యాయ పోస్టులకు కూడా దాదాపు 6 వేల వరకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

ఉన్నత విద్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులు దాదాపు 400 వరకు, డిగ్రీ లెక్చరర్ పోస్టులు 491 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉంది.