Intermediate admissions 2026 షెడ్యూల్ విడుదల - bikki news

INTERMEDIATE ADMISSIONS 2026 షెడ్యూల్ విడుదల

BIKKI NEWS (MAY 11) : Telangana Intermediate admissions 2026 schedule. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మిషన్ల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డ్ తాజాగా మరోసారి సీఎం ఆదేశాల మేరకు విడుదల చేసింది. పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం నేపథ్యంలో మొదటిసారిగా విడుదల చేసిన షెడ్యూల్ను రద్దుచేసి తాజాగా మరోసారి విడుదల చేయడం జరిగింది

Telangana Intermediate admissions 2026 schedule

మే 12 నుంచి 31 వరకు మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ జరగనుంది. జూన్ 01 న మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30 న మొదటి విడత అడ్మిషన్లు పూర్తి కానున్నాయి.

1) మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు:అడ్మిషన్లు పూర్తిగా పదో తరగతిలో సాధించిన GPA (Grade Point Average)మరియు సబ్జెక్టుల వారీగా వచ్చిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే జరగాలి. అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు.

2) ప్రొవిజనల్ అడ్మిషన్: ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాళ్లు తాత్కాలిక ప్రవేశాలు కల్పించవచ్చు. అసలు సర్టిఫికేట్లు సమర్పించిన తర్వాతే అడ్మిషన్ ఖరారు అవుతుంది.

3) ఆధార్ తప్పనిసరి: అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులు తమ ఆధార్ నంబర్‌ను సమర్పించడం తప్పనిసరి

4);యాంటీ-డ్రగ్ అఫిడవిట్: అడ్మిషన్ సమయంలో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తప్పనిసరిగా యాంటీ-డ్రగ్ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది

5) అఫిలియేటెడ్ కాలేజీలే లక్ష్యం:కేవలం ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న (Affiliated) కళాశాలల్లోనే చేరాలని బోర్డు సూచించింది. గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను tgbie.cgg.gov.in లేదా acadtgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →