Inter results - కే. కేశవరావు చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు - bikki news

INTER RESULTS – కే. కేశవరావు చేతుల మీదుగా ఇంటర్ ఫలితాలు

హైదరాబాద్ (ఏప్రిల్ 11) : Telangana Inter results 11 am on April 12th. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) కీలక ప్రకటన చేసింది. 2026 మార్చిలో జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (General & Vocational) పరీక్షల ఫలితాలను రేపు, అనగా ఏప్రిల్ 12న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

Telangana Inter results 11 am on April 12th

​తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ కె. కేశవరావు మరియు విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ బోర్డు వైస్ ఛైర్‌పర్సన్ శ్రీమతి యోగితా రాణా, I.A.S. గారు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం (విద్యా భవన్)లో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఫలితాలను ఎలా చూసుకోవాలి?

​ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు కింద పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

https://tgbie.cgg.gov.in
http://results.cgg.gov.in
    Google News@WHATSAPP
    @TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

    View all posts by Saheb Shaik →