Engineering seats - బీటెక్ సీట్ల కేటాయింపు - విద్యార్థులు ఎం చేయాలంటే - bikki news

Engineering Seats – బీటెక్ సీట్ల కేటాయింపు – విద్యార్థులు ఎం చేయాలంటే

BIKKI NEWS (July 11) : Telangana Engineering seats alloted and fee date. తెలంగాణ రాష్ట్ర ఈఏపీ సెట్ 2026 లో భాగంగా తొలి విడత ఇంజనీరింగ్ సీట్లను ఉన్నత విద్యాశాఖ కేటాయించింది. 79,891 మంది విద్యార్థులు తొలి విడతలో సీట్లు పొందడం జరిగింది.

Telangana Engineering seats alloted and fee date

సీటు పొందిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అలాట్మెంట్ ఆర్డర్ ను డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.

అనంతరం అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ట్యూషన్ ఫీజులు జూలై 14వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

విద్యార్థులు భవిష్యత్తులో సీటు రద్దు చేసుకునే ఉద్దేశం ఉంటే సొంత బ్యాంక్ అకౌంట్ నుండి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రద్దు చేసుకున్న నేపథ్యంలో ఫీజు వాపసు చేయబడుతుంది.

ఫీజు చెల్లించిన తర్వాత ఆన్లైన్ లోనే విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం వచ్చిన కళాశాల, కోర్సులపై అసంతృప్తిగా ఉంటే రెండో విడతలో వెబ్ ఆప్షన్లను విద్యార్థులు ఇచ్చుకునే అవకాశం ఉంది.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/default.aspx

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →