ALMONT KID SYRUP – ఈ సిరప్ వాడకంపై కీలక ఆదేశాలు

Stop usage of almont kid syrup
  • BIKKI NEWS (2026 JAN. 10) :

stop usage of Almont kid syrup by TGDCA. తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘అల్మాంట్-కిడ్ సిరప్’ లో ప్రమాదకరమైన ఎథిలిన్ గ్లైకాల్ (Ethylene Glycol) కలిసినట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడంతో, ఆ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

stop usage of Almont kid syrup by TGDCA

కల్తీగా తేలిన సిరప్ వివరాలు
  • సిరప్ పేరు: అల్మాంట్-కిడ్ (Levocetirizine & Montelukast Syrup)
  • బ్యాచ్ నెంబర్: AL-24002
  • తయారీ తేది: జనవరి 2025
  • గడువు తేది: డిసెంబర్ 2026
  • తయారీదారు: ట్రిడస్ రెమెడీస్, హాజీపూర్, వైశాలి జిల్లా, బిహార్

Read this alao – ఈ దగ్గు సిరప్ లు డేంజరస్

ఎందుకు ప్రమాదకరం.?

ఎథిలిన్ గ్లైకాల్ అనేది అత్యంత విషపూరిత రసాయనం. ఇది ముఖ్యంగా:

  • కిడ్నీలకు తీవ్రమైన నష్టం
  • నరాల వ్యవస్థపై ప్రభావం
  • పిల్లల్లో ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం

కావున ఈ సిరప్ వాడకం తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

ప్రజలకు అధికారుల సూచనలు

మీ వద్ద పై బ్యాచ్‌కు చెందిన అల్మాంట్-కిడ్ సిరప్ ఉంటే వెంటనే వాడకం ఆపాలి. దగ్గరలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి

టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చు (సోమవారం–శుక్రవారం, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు)

వైద్య దుకాణాలు & ఆసుపత్రులకు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు ఈ బ్యాచ్‌కు చెందిన సిరప్‌ను తక్షణమే నిల్వల నుంచి తొలగించి, విక్రయించకుండా ఫ్రీజ్ చేయాలని DCA ఆదేశాలు జారీ చేసింది.

కఠిన చర్యలు

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజారోగ్యానికి ముప్పు లేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →