SSC JE Recruitment 2026 : 1,748 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్

Ssc je recruitment 2026

BIKKI NEWS (SEP. 08) : SSC JE Recruitment 2026. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1,748 జూనియర్ ఇంజనీర్ (JE – గ్రూప్-బీ) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితర ఇంజనీరింగ్ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

SSC JE Recruitment 2026

ముఖ్యమైన వివరాలు

విభాగంవివరాలు
సంస్థస్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
పోస్టుల సంఖ్య1,748 జూనియర్ ఇంజనీర్ (గ్రూప్-బీ) పోస్టులు
విభాగాలుసివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితరాలు
వేతనంపే మ్యాట్రిక్స్ లెవెల్-6 ప్రకారం రూ. 35,400 ప్రాథమిక వేతనం + అలవెన్సులు
దరఖాస్తు చివరి తేదీసెప్టెంబరు 22
అధికారిక వెబ్‌సైట్ssc.gov.in
అర్హతలు & అనుభవం
  • సంబంధిత విభాగాల్లో (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం, సీఎస్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్) డిప్లొమా లేదా బీఎస్సీ/బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
  • పోస్టును బట్టి నిర్ణీత రంగంలో ఉద్యోగానుభవం అవసరం.
వయోపరిమితి (01.08.2026 నాటికి)
  • సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (CPWD) పోస్టులకు గరిష్ట వయసు 32 ఏళ్లు.
  • మిగతా అన్ని శాఖల పోస్టులకు గరిష్ట వయసు 30 ఏళ్లు మించకూడదు.
  • వయోపరిమితి సడలింపులు: ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు; ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం & పరీక్షా సరళి అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు (పేపర్-1, పేపర్-2) మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.

  • పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్):
    • మొత్తం 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. సమయం 2 గంటలు.
    • జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ (50 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (50 మార్కులు), సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్టు (100 మార్కులు).
    • ప్రతి తప్పు సమాధానానికి 0.25 (పావు) మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
    • పరీక్ష సమయం: అక్టోబర్ లేదా నవంబర్.
  • పేపర్-2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్):
    • సివిల్, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ సంబంధిత ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
    • మొత్తం మార్కులు: 300, సమయం: 2 గంటలు.
    • ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.
    • పరీక్ష సమయం: డిసెంబర్.

దరఖాస్తు రుసుము & దరఖాస్తు విధానం

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 100.
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
  • ఆసక్తి గల అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ [https://ssc.gov.in/](https://ssc.gov.in/) ద్వారా సెప్టెంబరు 22 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →