- BIKKI NEWS : 16-01-2016
Salary cut if you don’t take care of your parents. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగులకు కీలక సూచన చేశారు. తల్లిదండ్రులను చూసుకొని ఉద్యోగుల వేతనంలో 10 శాతం కట్ చేసి వారి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తామని తెలిపారు.
Salary cut if you don’t take care of your parents.
ఈరోజు మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో 1370 మంది గ్రూప్ 3 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
తల్లిదండ్రులను చూసుకోని వారు మానవ జన్మ ఎత్తడం వృధా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు ఎక్కువ మంది సంతానం ఉండడం వలన ఎవరో ఒకరు చూసుకునే వారని, కానీ ఇప్పుడు ఒక్కరూ లేదా ఇద్దరు సంతానం ఉండడం వలన కచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని హితవు పలికారు.
అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి అయిన తరువాత కూడా తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాలని లేని పక్షంలో వారి వేతనం నుంచి 10 నుంచి 15 శాతం వారి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు.

