absenteeism – ప్రభుత్వ ఉద్యోగుల గైర్హాజరుపై కఠిన నిబంధనలు 2026

Go ms 09 by telangana

BIKKI NEWS : Strict rules on the absenteeism of government employees. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విధులకు గైర్హాజరు కావడంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సివిల్ సర్వీసెస్ (నియమావళి, నియంత్రణ మరియు అప్పీల్) రూల్స్, 1991కి సవరణలు చేస్తూ జీ.ఓ. ఎం.ఎస్. నెం. 9 (G.O.Ms.No. 9) జారీ చేసింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Strict rules on the absenteeism of government employees

​ఈ నూతన సవరణల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగిని ఈ క్రింది సందర్భాలలో సర్వీసు నుండి తొలగించినట్లుగా (Deemed to have been removed from service) పరిగణిస్తారు:

1) ​అనుమతి లేకుండా గైర్హాజరు

ఎటువంటి ముందస్తు అనుమతి (Authorization) లేకుండా ఒక సంవత్సరం (1 Year) కంటే ఎక్కువ కాలం విధులకు గైర్హాజరైతే సర్వీస్ నుంచి తొలగించినట్లే.

2) ​దీర్ఘకాలిక గైర్హాజరు

సెలవు మంజూరైనా లేదా కాకపోయినా, వరుసగా 5 సంవత్సరాలు (5 Years) విధులకు దూరంగా ఉంటే సర్వీస్ నుంచి తొలగించినట్లే.

3) ఫారిన్ సర్వీస్

ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా ఫారిన్ సర్వీస్‌లో (Foreign Service) కొనసాగితే.

​అయితే, ఈ నిబంధన కింద చర్యలు తీసుకునే ముందు సంబంధిత ఉద్యోగికి తమ వివరణను ఇచ్చుకోవడానికి షోకాజ్ నోటీసు (Show Cause Notice) జారీ చేయబడుతుందని, వారి సమాధానాన్ని పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →