BIKKI NEWS (DEC. 06) : Rtd. Captain Lingala Pandu Ranga Reddy visited GJC Jangoan. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని దేశ రక్షణకు అంకితం కావాలని రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండురంగారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. జనగామ పట్టణంలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ శీకటి సునంద ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనగామ జిల్లా దేవరుప్పల మండలం నీర్మల గ్రామానికి చెందిన రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల రంగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Rtd. Captain Lingala Pandu Ranga Reddy visited GJC Jangoan
విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ విద్యపై పట్టు సాధించి పుస్తక పఠనంపై ఆసక్తి కనబరచాలని కోరారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు ఎన్డీఏ, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మార్గాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. విద్యార్థులు టీవీలు చూడడం సెల్ఫోన్ వంటి పరికరాలకు దూరంగా ఉండి చదువు పట్ల శ్రద్ధ కనబరిస్తే ఉన్నత శిఖరాలకు చేరతారన్నారు. జాతీయస్థాయి పోటీ పరీక్షలలో తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా పాల్గొని తెలుగువారి సత్తా చాటాలని ఆకాంక్షించారు.
కళాశాల ప్రిన్సిపాల్ సునంద మాట్లాడుతూ జాతీయస్థాయిలో మిలటరీలో ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసిన డాక్టర్ లింగాల పాండురంగారెడ్డి కళాశాలను సందర్శించి విద్యార్థులకు సలహాలు సూచనలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం నిర్మల గ్రామంలో జన్మించి మిలటరీలు సుదీర్ఘకాలం పాటు దేశ సేవకు అంకితం అయిన వ్యక్తులు తమ కళాశాలను సందర్శించడం శుభసూచకం అన్నారు. డాక్టర్ లింగాల పాండురంగ రెడ్డి గారు తన రిటైర్మెంట్ అనంతరం కూడా ఇంటర్ విద్యా బలోపేతానికి సెంటర్ హెడ్, సెంట్రల్ ఆఫ్ తెలంగాణ మరియు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమాజాభివృద్ధికి తమ సేవలను అందించడం జనగామ జిల్లాకే గర్వకారణం అన్నారు.
ఈ సందర్భంగా కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

