Open category - ఆ రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోకే - సుప్రీంకోర్టు - bikki news

Open Category – ఆ రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోకే – సుప్రీంకోర్టు

BIKKI NEWS (APRIL 19) : Reserved candidates must got open Category if they get open Category marks says Supreme court. ఓపెన్ కేటగిరి కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులను ఓపెన్ కేటగిరి లోనే సీట్లు కేటాయించాలని సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పును వెలువరించింది.

Reserved candidates must got open Category

2020లో కేరళ హైకోర్టు ఏయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఓపెన్ కేటగిరి కంటే ఎక్కువ మార్కులు సాధించిన రిజర్వుడ్ అభ్యర్థికి కాకుండా ఓపెన్ కేటగిరి అభ్యర్థికి ఉద్యోగం కల్పించాలని ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు తోసిపిచ్చింది.

ఓపెన్ కేటగిరి రిజర్వేషన్ లేని వర్గాల కోసం కేటాయించిన కోటా కాదు అని, ప్రతిభ మాత్రమే ఉన్న అన్ని వర్గాల విద్యార్థుల, అభ్యర్థుల సమూహం అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

ప్రతిభా ఆధారంగా విద్యార్థులను, అభ్యర్థులను రిజర్వు కేటగిరీలో నుండి అన్ రిజర్వు కేటగిరి లోనికి మార్చడం అనేది రాజ్యాంగం లోని 14, 16 ఆర్టికల్స్ ప్రకారం అనివార్యమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులు, విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఓపెన్ కేటగిరి కంటే ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారిని ఓపెన్ కేటగిరీ కిందనే పరిగణించాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →