RED ALERT : ఆ జిల్లాకు రెడ్ అలర్ట్

BIKKI NEWS (AUG. 27) : red alert for telangana districts due to rains. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, కామారెడ్డి జిల్లాలకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

red alert for telangana districts due to rains.

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆగస్టు 28న ఉదయం వరకు ఈ జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే

ఇక పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ పేర్కొంది.