BIKKI NEWS (AUG. 27) : Rain holiday on August 28th. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఆగస్టు 28న విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు డీఈవో రాజు ప్రకటించారు. స్కూళ్లు, కాలేజీలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.
Rain holiday on August 28th.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రేపు అటు వర్ష ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

