BIKKI NEWS (DEC. 28) : Ratan Tata Jayant December 28th. రతన్ నవల్ టాటా (1937 డిసెంబరు 28 – 2024 అక్టోబరు 9) భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్ కు పూర్వపు చైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూపునకు చైర్మన్ గా ఉన్నారు. టాటా ఛారిటబుల్ ట్రస్టులకు అధిపతిగా ఉన్నారు.
Ratan Tata Jayant December 28th.
రతన్ టాటా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్ (2008), పద్మభూషణ్ (2000) లను అందుకున్నారు. భారత రత్న ఇవ్వాలని బలమైన ప్రజా డిమాండ్ ఉంది.
అతను అత్యున్నత వ్యాపారంలో విలువలు, దాతృత్వానికి గుర్తింపు పొందారు.
1991లో జె.ఆర్.డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత అతనికి వారసునిగా భాద్యతలు చేపట్టారు. అతను టాటా కంపెనీని ఎక్కువగా భారత-కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అమెరికన్ టీ కంపెనీ టెట్లీని, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను, టాటా స్టీల్ ఐరోపా (కోరస్)ను విజయవంతంగా టాటా సంస్థలో విలీనం చేశారు.
సామాన్యులకు కారు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించిన నానో కారు విజయవంతం కాలేదు. కానీ సామాన్యుల కోసం ఆలోచించిన తీరు రతన్ టాటా ను సామాన్యుల వ్యాపారవేత్తగా నిలుపుతుంది.
ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10 వేలకోట్ల టర్నోవర్ గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం, ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
సహాయం చేయడం, దాతృత్వం, వ్యాపారంలో ఉన్నత విలువలు పాటించడం వంటి అంశాలలో రతన్ టాటా గురించి కథలు కథలుగా చెప్పడానికి అనేక అంశాలు ఉన్నాయి.
రతన్ టాటా 2024 అక్టోబరు 9న 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
- Assistant Professor recruitment – 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- Today Gold Rate October 1st 2026 – తగ్గిన బంగారం ధర
- Daily GK bits in Telugu part 181 – జీకే బిట్స్
- Transfers – మార్చిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు: పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన
- Telangana PRC report – గడువు ముగిసినా ప్రభుత్వానికి చేరని పీఆర్సీ నివేదిక

