పరిస్థితిని బట్టి విద్యాసంస్థలకు రెయిన్ హాలిడే – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (AUG. 12) : Rain holidays in telangana orders. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Rain holidays in telangana orders

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చే 72 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించార.

లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని , ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

క్లౌడ్ బరస్ట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని తెలిపారు, వచ్చే 3 రోజులు అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసులు, హైడ్రా అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని, ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేయాలని సీఎం రేవంత్ తెలిపారు.