BIKKI NEWS (AUG. 13) : rain Holiday on 14th August. తెలంగాణలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తాజాగా సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆగస్టు 14న పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.
rain Holiday on 14th August.
రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లాలో గురువారం పాఠశాలలు, కళాశాలలకు భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ ప్రావీణ్య సెలవులు ప్రకటించారు. అలాగే, వికారాబాద్ జిల్లాలోని పాఠశాలకు గురు, శుక్రవారాల్లో సెలవులను ప్రకటిస్తూ ప్రతీక్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే జగిత్యాల, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, మేడ్చల్, మంచిర్యాల, జనగామ, యాదాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు సెలవులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో సెలవులు ప్రకటించారు.

