BIKKI NEWS (JULY 14) : PRE PRIMARY TEACHERS JOBS NOTIFICATION. తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 210 ప్రీ పైమరీ పాఠశాలల్లో టీచర్ల భర్తీ కొరకు నోటిఫికేషన్లు త్వరలోనే జారీ చేయనున్నారు.
మరోవైపు మరో 800 ప్రీప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటికీ ఇంకా అనుమతి లభించలేదు. వీటికి కూడా అనుమతి లభిస్తే 1000 కి పైగా విద్యా వాలంటీర్ మరియు ఆయా జాబ్స్ కు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ వారి నియామకం, ఇతర విధివిధానాలపై మార్గదర్శకాలు జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది.
యూకేజీ పాఠాల బోధనకు ఒక విద్యా వాలంటీర్ తోపాటు చిన్నారులకు అవసరమైన సపర్యలు చేసేందుకు ఆయాను కూడా నియమిస్తామని అధికారులు తెలిపారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు తాము పర్యవేక్షిస్తామని చెబుతున్నట్లు తెలిసింది.