BIKKI NEWS (NOV. 22) : Ordinance on Regularization of contract employees in Telangana act.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఇతర తాత్కాలిక ఉద్యోగులు తమ సర్వీసు క్రమబద్ధీకరణ కోరుతూ మరియు క్రమబద్ధీకరణ కాబడిన ఉద్యోగులు పాత పెన్షన్ కోరుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై ఆర్డినెన్సు తేవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
Ordinance on Regularization of contract employees in Telangana act.
తాజాగా ఆర్థిక శాఖ క్రమబద్ధీకరణ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగుల కు పాత పెన్షన్ అమలుకు సంబంధించిన అంశంపై సవరణ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. పాత పెన్షన్ అమలు చేస్తే 26 వేల కోట్ల అదనపు భారం పడుతుందని అర్దిక శాఖ తెలిపినట్లు సమాచారం.
అయితే తాత్కాలిక ఉద్యోగులు క్రమబద్ధీకరణ కొరకు, క్రమబద్ధీకరణ కాబడిన కాంట్రాక్టు ఉద్యోగులు పాత పెన్షన్ కొరకు కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పులిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇందుకు సంబంధించిన 1994 చట్టం (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ టు పబ్లిక్ సర్వీ సెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్)కు సవరణ చేయాలని నవంబర్ 17న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో దీనిపై నేడో రేపో ఆర్డినెన్స్ జారీ కానున్నట్లు సమాచారం. 1994 ఏప్రిల్ 22న జీవో నంబర్ 212, ఆ తర్వాత 1997 జూలై 23న జీవో 112 ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోల్లోని అంశాలను 1998 చట్టంలోనూ చేర్చారు. ఈ జీవో లో ప్రకారం తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వీలు కలుగుతుంది.
- Police Constable Leftover 400 Vacancies verdict – 400 పోస్టుల భర్తీపై హైకోర్టు తీర్పు
- Current affairs in Telugu_English 17 November 2026
- Telangana SI Prelims exam Hall Tickets 2026 డౌన్లోడ్ లింక్
- Today Gold Rate 22nd November 2026 – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- SI and Police Constable Model papers – ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల మోడల్ పేపర్లు
ఇవి కూడా చదవండి : Action on 35 junior lecturers – ఫేక్ సర్టిఫికెట్ల అంశంలో 35 మంది జూనియ | ఉద్యోగుల వార్తలు

