Online Gaming Bill – ఆన్లైన్ గేమింగ్ బిల్లు లో ఏముంది.?

BIKKI NEWS (AUG. 20) : ONLINE GAMING BILL 2025 IN LOKSABHA. కేంద్ర ప్రభుత్వం ఈరోజు లోక్ సభ లో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025ను ప్రవేశ పెట్టింది. దీనిని మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశ పెట్టారు.

ONLINE GAMING BILL 2025 IN LOKSABHA.

ఈ బిల్లు ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణిస్తుంది.

ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు.

నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని ప్రతిపాదించారు.

సంబంధిత అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

ఆన్లైన్ గేమింగ్ ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు.

ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా కాకుండా.. బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు.