Oilfed jobs notification 2026 – తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Oilfed jobs notification 2026

BIKKI NEWS : Oilfed jobs notification 2026. తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ (Oilfed) సంస్థలో పదేళ్ల తర్వాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 73 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నియామకాల బాధ్యతను హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Oilfed jobs notification 2026

తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం 73 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నియామక ప్రక్రియను జేఎన్టీయూహెచ్ (JNTUH), హైదరాబాద్‌ ద్వారా నిర్వహించనున్నారు.

2027 మార్చి 31లోగా నియామకాలు పూర్తి

ఆయిల్‌ఫెడ్‌లో ఉద్యోగ నియామకాలను 2027 మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ప్లాంట్స్ అండ్ ఫార్మర్స్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయనున్నారు.

చివరిసారిగా 2016-17లో నియామకాలు

ఆయిల్‌ఫెడ్‌లో చివరిసారిగా 2016-17 సంవత్సరంలో 18 పోస్టులను భర్తీ చేశారు. ప్రస్తుతం సంస్థలోని వివిధ పోస్టుల్లో 37 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

నిరుద్యోగులకు కీలక సమాచారం

73 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. అయితే పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ విడుదల తేదీ వంటి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →