BIKKI NEWS : 15000 Telangana Government jobs notifications soon say Ponguleti Srinivas Reddy. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటికే రెండేళ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు..
15000 Telangana Government jobs notifications soon
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీపికబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ‘పీఎస్ఆర్ యువ నేస్తం’ పేరుతో ఏడాది పాటు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అవసరమైతే శిక్షణ గడువును మరింత పొడిగిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం లక్ష మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.
పీఎస్ఆర్ యువ నేస్తం ఉచిత శిక్షణ ప్రారంభం
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో ‘పీఎస్ఆర్ యువ నేస్తం’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రముఖ ఆర్‌సీ ఎగ్జామ్స్ సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఎలాంటి కటాఫ్ తేదీ లేదని, లక్ష మందితోనే శిక్షణను పరిమితం చేయబోమని స్పష్టం చేశారు. ఎంతమంది అభ్యర్థులు ముందుకొచ్చినా ఉచిత శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ప్రస్తుతం ఏడాది పాటు శిక్షణ అందించనున్నామని, అవసరమైతే గడువును పొడిగిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పుస్తకాలు, స్టడీ మెటీరియల్ కూడా ఉచితమే
ప్రైవేట్ సంస్థల్లో నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ పొందాలంటే ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని మంత్రి పేర్కొన్నారు. పుస్తకాలు, ఇతర శిక్షణా సామగ్రి కోసమే సుమారు రూ.14 వేల నుంచి రూ.30 వేల వరకు వ్యయం అవుతుందని వివరించారు.
గతంలో 2,300 మందికి శిక్షణ.. 462 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
2016లో ఖమ్మం ప్రాంతంలోని నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గుర్తుచేశారు. అప్పట్లో సుమారు 2,300 మందికి శిక్షణ అందించగా, వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడించారు.

