జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్ లో NSS వేడుకలు

BIKKI NEWS (SEP. 24) : NSS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

NSS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి. లలిత అధ్యక్షత వహించడం జరిగింది.

కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందము విద్యార్థిని మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

అనంతరము విద్యార్థులలో మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ అక్షరాల రూపంలో కూర్చొని మానవహారం ఏర్పడడం జరిగింది.

కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల లలిత గారు మాట్లాడుతూ… ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అంకితభావంతో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మంచి వాలంటీర్ గా గుర్తింపు పొంది స్వచ్ఛభారత్, సాంఘిక అవగాహన ర్యాలీలు ప్రత్యేక శిబిరాల్లో పాల్గొని సామాజిక సేవలు అందించాలన్నారు.

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డీ. కరుణాకర్
మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ యొక్క ఆవిర్భావం ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలు ఎన్ఎస్ఎస్ లో నిర్వహించే కార్యక్రమాలు అవగాహన ర్యాలీలు ప్రత్యేక శిబిరాలు చెట్ల పెంపకం ట్రాఫిక్ నియంత్రణ మొదలగు అంశాలను గురించి వివరిస్తూ వాలంటీర్లు సమాజంలో గొప్ప గుర్తింపును పొందాలన్నారు.

తెలుగు అధ్యాపకులు డి. రవీందర్ మాట్లాడుతూ విద్యార్థినిలు నైతిక విలువలు కలిగి ఉండాలన్నారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమాలలో కళాశాల అధ్యాపక బృందం డి రవీందర్,S. సదానందం, టీ నిర్మలాదేవి, బి లక్ష్మయ్య, ఏ సంపత్, కే స్వరూప, ఎస్ కవిత, జి కవిత, ఆస్మాపిర్దోస్, ఓ రాణి, మరియు.లైబ్రేరియన్ శ్రీమతి హిమబిందు, జూనియర్ అసిస్టెంట్ ఎస్ రాములు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు