BIKKI NEWS (DEC. 04) : NAVY DAY DECEMBER 4th. భారత దేశములో నౌకాదళ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 4 వ తేదీన జరుపుతారు. దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం, భారతదేశ రాష్ట్రపతి నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు. 17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి, ఛత్రపతి శివాజీ భోంస్లే “భారత నావికా పితామహుడి”గా భావిస్తారు.
NAVY DAY DECEMBER 4th.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో, ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు. ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.
1971 డిసెంబరు 4 భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచి పోర్టుపై మెరుపుదాడి చేసిమూడు ఓడలను ముంచి వేసింది. 1971ఇండో-పాక్ యుద్ధం రాత్రి సమయంలో భారత్ చేసిన ఆ దాడిని ఆపరేషన్ ట్రైడెంట్ అని అంటారు. దాని జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నేవీ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా విశాఖ సాగరతీరంలో తూర్పు నౌకాదళం పలు సాహస విన్యాసాలను నిర్వహిస్తుంది.
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
