BIKKI NEWS (AUG. 22) : mega Job mela at Karimnagar on 23rd August. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ హెచ్సీఎల్ టెక్ ఇంటర్ విద్యార్థుల కొరకు ఆగస్టు 23న మెగా జాబ్ మేళా ను కరీంనగర్ వేదికగా నిర్వహిస్తుంది.
mega Job mela at Karimnagar on 23rd August
తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం టెక్ బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ తో సంబంధం లేకుండా నేరుగా ఐటీ రంగంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నది.
శిక్షణ, ఇంటర్న్షిప్ తో పాటు, హెచ్సీఎల్లో పూర్తి స్థాయి ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నది.
ఉద్యోగ మేళాలో ఎంపికైన వారికి 6 నుంచి తొమ్మిది నెలలు తరగతిలో శిక్షణ, 3 నుంచి 6 నెలలు ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు ₹10వేల చొప్పున ఆరు నెలలకు స్టైఫండ్ అందిస్తారు.
ఆగస్టు 23న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్పేస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇందుకు 2024-25లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. వీరు ఇంటర్ కనీసం 75శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
పూర్తి వివరాల కోసం హెచ్సీఎల్ ప్రతినిధినిధి (63032 07394, 79818 34205) .