BIKKI NEWS (JULY 17) : MBBS BDS ADMISSIONS IN TELANGANA. తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్ కోటా కింద ఎంబిబిఎస్, బి డి ఎస్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
MBBS BDS ADMISSIONS IN TELANGANA.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం విద్యార్థులు జూలై 16 నుండి 25వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ అనంతరం రాష్ట్ర విద్యార్ధుల జాబితాతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అనంతరం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో మొత్తం 35 ప్రభుత్వ, 26 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి. డెంటల్ విభాగంలో ఒక ప్రభుత్వ, 11 ప్రైవేట్ కళాశాలలో ఉన్నాయి.
ప్రభుత్వ వైద్య కళాశాలలో 85% సీట్లను, ప్రైవేటు మెడికల్ కళాశాలలో 50% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు.
కటాఫ్ మార్కుల వివరాలు
జనరల్ కేటగిరి మరియు ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులకు 50 పర్సెంటైల్ కటాఫ్ మార్కులు – 144
ఎస్సీ, ఎస్టీ బీసీ పిడబ్ల్యూడీ 40% పర్సంటైల్ లో 113 మార్కులు కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు.
దివ్యాంగులు ఓసి 45% పర్సంటైల్ లో 127 మార్కులు కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు.
వెబ్సైట్ : https://www.knruhs.telangana.gov.in/

