BIKKI NEWS (DEC. 22) : MATHEMATICS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో ఘనంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు NSS చైర్మన్ శ్రీమతి. వి లలిత ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీ శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి అధ్యక్షత వహించడం జరిగింది.
MATHEMATICS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD
కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ మరియు.ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి వి లలిత మాట్లాడుతూ… శ్రీనివాస రామానుజన్ గొప్ప మేధావి అని తెలుపుతూ విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శ్రీనివాస రామానుజన్ ని ఆదర్శంగా తీసుకుని, తార్కిక ఆలోచన విధానాన్ని అలవర్చుకొని, సుజనాత్మకతతో చదివి ఇంజనీరింగ్, మెడిసిన్ మరియు బ్యాంకింగ్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలలో రాణించాలని సూచించారు.
అనంతరము కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు శ్రీ బీ. లక్ష్మయ్య మాట్లాడుతూ గణిత శాస్త్రం అన్ని శాస్త్రాలకు మూలo అని తెలుపుతూ గణిత శాస్త్రం యొక్క ఆవిర్భావం మరియు ఆవశ్యకతను గురించి పేర్కొన్నారు. శ్రీనివాస రామానుజన్ గొప్ప మేధావి అని తెలుపుతూ విద్యార్థినిలు శ్రీనివాస రామానుజన్ గారి యొక్క సంకల్పాన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తితో చదివి రాష్ట్రస్థాయి ర్యాంకులను సాధించి లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీ డి కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగినది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్.శ్రీమతి లలిత మరియు గణిత శాస్త్ర ఆధ్యాపకులు శ్రీ బి లక్ష్మయ్య లను అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం విద్యార్థినిలు అందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమాలలో కళాశాల అధ్యాపక బృందం సంపత్, సదానందం, నిర్మలాదేవి, జి కవిత, శ్రీమతి ఆస్మాపిర్దోస్, లైబ్రేరియన్ శ్రీమతి బి. హిమబిందు, జూనియర్ అసిస్టెంట్ ఎస్. రాములు విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొదలగు వారు పాల్గొన్నారు.

