Karimnagar job mela – 13న జాబ్ మేళా

Karimnagar job mela on 13th october

BIKKI NEWS : Karimnagar Job Mela on 13th October . నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలో ఈ నెల 13న జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 40 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత సమయంలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Karimnagar Job Mela on 13th October

టవర్ సర్కిల్, అక్టోబర్ 11: కరీంనగర్ జిల్లా నిరుద్యోగుల కోసం జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో అక్టోబర్ 13న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో ఫోర్ట్ ఈవీ మోటార్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు ఇతర సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 40 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జాబ్ మేళాలో భర్తీ చేయనున్న పోస్టులు

సంస్థ / ఉద్యోగంఅర్హత, వయోపరిమితినెల జీతం
ఫోర్ట్ ఈవీ మోటార్స్ – సేల్స్ మేనేజర్19–40 ఏళ్ల పురుష అభ్యర్థులురూ.20,000–30,000
టెలీకాలర్స్ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు పీజీడీసీఏ/డీసీఏ లేదా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న 19–30 ఏళ్ల మహిళా అభ్యర్థులురూ.8,000–10,000
సోలార్ టెక్నీషియన్ఐటీఐ ఎలక్ట్రీషియన్ అర్హత కలిగిన 19–40 ఏళ్ల పురుష అభ్యర్థులురూ.15,000–18,000

సోలార్ టెక్నీషియన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలవారీ వేతనం చెల్లించనున్నారు.

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు

అభ్యర్థులు అక్టోబర్ 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిరిగి జాబ్ మేళాకు హాజరుకావాలని అధికారులు సూచించారు. విద్యార్హతల సర్టిఫికెట్లు, బయోడేటా, అవసరమైన ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలి. పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే తెలుసుకుని అర్హతకు అనుగుణంగా పాల్గొనాలి.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

జాబ్ మేళా, ఉద్యోగ ఖాళీలు, అర్హతలు తదితర వివరాల కోసం అభ్యర్థులు 9908230384, 9963357250, 8897183366 నంబర్లను సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సూచించారు.

ముఖ్య గమనిక: ఉద్యోగాలకు వెళ్లే ముందు సంబంధిత సంస్థ, పోస్టుల వివరాలు, అర్హతలు, వేతనం తదితర అంశాలను ఫోన్ ద్వారా నిర్ధారించుకోవడం మంచిది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →