Joint staff council meeting - జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశ ముఖ్య సమాచారం - bikki news

Joint staff council meeting – జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశ ముఖ్య సమాచారం

BIKKI NEWS (MAY 15) : Joint staff council meeting decisions today. ఈరోజు ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సీఎస్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భేటీలో ప్రభుత్వం తరపున సీఎస్ గారు ఇచ్చిన హామీలు వివరాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం…

Joint staff council meeting decisions today

ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (EHS) జూన్ 2 నుంచి అమలు
ఉద్యోగుల మూలవేతనంలో 1.5% చొప్పున వసూలు చేసి, ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో EHS అమలు చేయనున్నట్లు తెలిపారు.

PRC నివేదికపై త్వరలో తదుపరి సమావేశం
PRC నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 100 రోజుల ప్రణాళిక
పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

2003 DSC ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌పై చర్చలు
పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రితో చర్చించి, వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

జిల్లాస్థాయిలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు
జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం
ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచించినట్లు వెల్లడించారు.

ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై పరిశీలన
ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ సెక్రటరీకి సూచించారు.

స్పౌస్ కేటగిరీలో కేంద్ర ఉద్యోగులకు అవకాశం
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐదు రోజుల పని విధానంపై పరిశీలన వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగులు, ఉపాధ్యాయుల పునరంకితం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో పని చేయాలని కోరారు.

టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంపు
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

    Google News@WHATSAPP
    @TELEGRAM@FACEBOOK
    Avatar of saheb shaik

    About Saheb Shaik

    Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

    View all posts by Saheb Shaik →