BIKKI NEWS (AUG. 20) : Jammu and Kashmir reorganization bill 2025. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
Jammu and Kashmir reorganization bill 2025
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి 6 సంవత్సరాలు అయింది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి, జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది కేంద్రం.
ఇప్పుడు ఈ బిల్లు ద్వారా తిరిగి జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈరోజు లోక్‌సభలో జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.